మెగాస్టార్ చిరంజీవి.. సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించి ఆగస్ట్ 14న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించనున్నట్టు సమాచారం. అది అలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ ఇదేనంటూ లేటెస్ట్‌గా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ లుక్‌లో చిరంజీవి ఒత్తైన మీసకట్టుతో వైట్ డ్రెస్‌లో సూపర్‌గా అదరగొడుతున్నాడు. లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్ త్రిషను ఎంపిక చేసుకుంది చిత్రబృందం. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి మురుగదాస్ స్టాలిన్‌లో జంటగా నటించి అదరగొట్టిన సంగతి తెలసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీన్ని చిరంజీవినే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా ఆయన మణిశర్మ, దర్శకుడు కొరటాల శివతో ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్‌ల కోసం రెండు వారల క్రితం బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa