ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఇద్దరూ కబడ్డీ కోచ్ లే అంటా!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2019, 01:10 PM

గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా నిన్న  ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ కబడ్డీ కోచ్ లే అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదే కథాంశంతో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో నటుడు గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. ఆయన సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సంపత్ నంది రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ ఇద్దరూ కబడ్డీ కోచ్ లే కావడం విశేషం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాద్ లో జరుగుతోంది. హిట్ట్ లు లేక సతమతమవుతున్న గోపిచంద్ కి మరి ఈ చిత్రమైనా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa