ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణాది చిత్రాలలో నటించాం ఇష్టం: సల్మాన్ ఖాన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2019, 02:13 PM

 బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తనకు దక్షిణాది చిత్రాలంటే చాలా ఇష్టమని, వాటి రీమేక్‌ల్లో నటించడాన్ని ఇష్టపడతానని తెలిపాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన `దబాంగ్-3` చిత్రంలో సల్మాన్ నటించాడు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చెన్నై వచ్చిన సల్మాన్ దక్షిణాది చిత్రాల గురించి మాట్లాడాడు. `దక్షిణాది చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. `పోకిరి`, `కిక్`, `సేతు` వంటి చిత్రాల రీమేక్‌ల్లో నేను నటించా. అవన్నీ విజయవంతమయ్యాయి. ప్రభుదేవా నాకు మంచి మిత్రుడు. ఆయనలో కష్టపడే తత్వం చాలా ఎక్కువ. అందువల్ల ఆయనే `దబాంగ్-3` సినిమాకు దర్శకత్వం చేయాలని కోరుకున్నా. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కాబోతోంద`ని సల్మాన్ చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa