ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూరప్ లో 'సరిలేరు నీకెవ్వరూ' మ్యూజిక్ లైవ్ స్కోర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2019, 02:59 PM

మహేష్ బాబు - అనిల్ రావిపూడి - దేవి కలయికలో రాబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు సాంగ్స్ రిలీజ్ అయి శ్రోతలను అలరిస్తుండగా..నెక్స్ట్ సోమవారం నాల్గో సింగిల్ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం దేవి సినిమా మ్యూజిక్ బిజీలో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ లైవ్ స్కోర్ యూరప్ లోని ఓ స్టూడియోలో జరుగుతున్నది. విదేశీ సంగీత కళాకారుల నేతృత్వంలో ఈ మ్యూజిక్ లైవ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11 వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు , అనిల్ సుంకర లు సంయుక్తం గా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa