టాలీవుడ్ సీనియర్ స్టార్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డిస్కో రాజా. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ మూవీస్ బ్యానర్‌పై రజనీ తళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ లిరికల్ వీడియోలను విడుదల చేస్తున్నారు. ముందుగా `నువ్ నాతో ఏమన్నావో` అంటూ సాగే మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేశారు. వింటేజ్ ఫీల్‌తో రూపొందించిన ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాలోని మరో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఢిల్లీ వాలా అంటూ సాగే రెండు పాటను శుక్రవారం రిలీజ్ చేశారు. ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పాట ఇప్పటి వరకు 1.5 మిలియన్ (15 లక్షల) వ్యూస్ సాధించింది. రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహా, వెన్నెల కిశోర్, సత్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa