ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి తేజ మాస్ లుక్ లో కనిపించబోతున్నారట!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 04:46 PM

మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు సాయి ధరంతేజ్. మొదట్లో మంచి విజయాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. కాగా ఈ మెగా మేనల్లుడికి చిత్రలహరి సినిమా మంచి విజయం అందించి బూస్ట్ ఇచ్చింది. తాజాగా ప్రతి రోజు పండగే సినిమా భారీ విజయం వైపు దూసుకు పోతుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా నటించగా ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. గీత ఆర్ట్స్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ప్రతి రోజు పండగే సినిమా భారీ విజయంతో సాయి ధరంతేజ్ కెరీర్ గాడిలో పడ్డారు కనిపిస్తోంది. ఈ మెగా మేనల్లుడు తర్వాతి సినిమాగా సోలో బ్రతుకే సో అనే టైటిల్ తో నిర్మితమవుతుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ పూర్తి కాగానే మరో ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు దేవకట్టా ఈ సినిమాకు తెరకెక్కించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలో సాయి ధరంతేజ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారట . మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు దేవాకట్ట ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa