పింక్ మూవీతో పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఖాయమైపోయింది. ఆయన చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. ఒకటి పింక్. రెండోది క్రిష్ సినిమా. ఇప్పుడు క్రిష్ సినమాలో పవన్ పాత్ర ఏమిటన్న విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో పవన్ దొంగగా కనిపించనున్నాడు. మొఘలాయిల కాలానికి సంబంధించిన కథ ఇది. మహమ్మదీయుల పరిపాలనా కాలం, అప్పటి పరిస్థితులు. ఇవన్నీ తెరపై చూపించబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ వందకోట్లు పైనే అని తెలుస్తుంది. జానపదం కావడంతో కొన్ని భారీ సెట్లు వేసే ప్లాన్ కూడా జరుగుతుంది. ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa