ఇప్పటివరకూ లవర్ బాయ్ ఇమేజ్ తో అదే తరహా చిత్రాలను నాగశౌర్య చేస్తూ వచ్చాడు. అందుకు భిన్నంగా ఈ సారి ఆయన యాక్షన్ సినిమా చేశాడు. 'అశ్వత్థామ' టైటిల్ తో ఈ సినిమా రూపొందింది. పవర్ఫుల్ టైటిల్ .. అందుకు తగిన పవర్ఫుల్ రోల్లో నాగశౌర్య కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.
ప్రస్తుతం నాగశౌర్య తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. జనవరి 31వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. నాగశౌర్య సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కొత్త ఏడాదిలో నాగశౌర్యను హిట్ పలకరిస్తుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa