ఇటీవల కాలంలో కంటెంట్ వుంటే చాలు యూత్ ఆ సినిమాకి ఫుల్ మార్కులు ఇచ్చేస్తున్నారు. అలా యూత్ ఫుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'మత్తు వదలరా'. హీరోయిన్ ప్రస్తావన లేకుండా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగిన ఈ కథకి ప్రేక్షకుల ఆదరణ దక్కింది.
ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం తమదైన శైలిలో స్పందించారు. తాజాగా ప్రభాస్ కూడా 'మత్తు వదలరా' టీమ్ తో కలిసి ఈ సినిమా చూశాడు. ఈ సినిమా ఎలా వుంది? కొత్త దర్శకుడి టేకింగ్ ఎలా వుంది? సాంకేతిక నిపుణుల పనితీరు .. ఆయా పాత్రలలో నటీనటుల నటన ఎలా వుంది? మొదలైన అంశాలను గురించి ప్రభాస్ మాట్లాడాడు. ఆ వీడియోను ఈ సినిమా టీమ్ రేపు వదలనుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ .. ప్రభాస్ తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa