హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన వెంకట్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ప్రభాస్ రానున్నట్టు సమాచారం. ప్రభాస్ – అనుష్క మధ్య మంచి స్నేహం వుంది. ఇద్దరూ కలిసి వరుస సినిమాల్లో నటించడం వలన ఆ స్నేహం మరింత బలపడింది. అందుకే అనుష్క సినిమా ప్రమోషన్ కి సంబంధించిన విషయం కావడంతో ముఖ్య అతిథిగా రావడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa