అల్లు అర్జున్- త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ‘సామజవరగమన’ సాంగ్ టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ అయి ఘన విజయం సాధించింది. కాగా తాజాగా ఈ సాంగ్ వీడియో ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రోమోలో బన్నీ డాన్స్ మూమెంట్స్, పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్సీ అలాగే సాంగ్ షూట్ చేసిన విధానాం అద్భుతంగాఉన్నాయి. బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఈ సాంగ్ ఉండబోతుందని ఈ వీడియో ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ సాంగ్ ను సిడ్ శ్రీరామ్ చక్కగా పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa