పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్నాడు. కాగా కరణ్ జోహార్ నేతృత్వంలోని ధర్మ ప్రొడక్షన్స్ ఈ ‘ఫైటర్’ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ముంబైలో షూట్ చేయనున్నారు. కరణ్ జోహార్ బృందం పూరీతో పాటు ఈ చిత్రం లొకేషన్స్ వెతుకున్నారట. ముంబైలోని జుహు, తాజ్ హోటల్ లాంటి ఐకానిక్ ఏరియాల్లో షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రం 2020 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa