ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణ్ రామ్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2019, 01:18 PM

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఎంత మంచివాడవురా”.  ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ను జనవరి 8న హైదరాబాద్‌లో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలుస్తోంది. ‘ఎన్టీఆర్ – బాలయ్య’ ఒకే వేదిక పై చూడాలని నందమూరి ఫ్యాన్స్ చాల ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. ఇక ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa