ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భిన్నమైన సినిమాలే చేస్తున్న రెజినా !

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2019, 02:07 PM

అందాల నటి రెజినా తమిళ దర్శకుడు కార్తిక్ రాజు డైరెక్షన్లో ఒక కొత్త చిత్రం మొదలుకానుంది. ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో రెజినా ఒక కీ రోల్ చేయనుంది.అందాల నటి రెజినా కొంతకాలంగా తెలుగులో భిన్నమైన సినిమాలే చేస్తోంది. ‘ అ !, సెవెన్, ఎవరు’ లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఈ సినిమాల్లో ఆమె పాత్రలకు మంచి పేరే దక్కింది. అందుకే ఇకపై కూడా అలాంటి చిత్రాలే చేయనుంది .  ఇంతకీ అమె పాత్ర ఏమిటని అనుకుంటున్నారా.. ఆస్ట్రాలజర్. ఇందులో మనుషుల భవిష్యత్ చెప్పే ప్రత్యేకమైన వ్యక్తిగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర మీద, సినిమా మీద రెజినా చాలా నమ్మకంగా ఉంది. జనవరి రెండో వారం నుండి చెన్నైలో ఈ సినిమా షూట్ మొదలుకానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa