తమిళ్ హీరో విజయ్ ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ కంగరాజ్ దర్శకత్వంలో తన 64వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ న్యూ ఇయర్ కానుకగా ఈరోజు సాయంత్రం 5గం.లకి రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీకి జేడీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. ఈ చిత్రంలో విజయ్ పాత్ర జేమ్స్ దురైరాజ్ కావడంతో మూవీకి షార్ట్‌గా జేడీ అనే టైటిల్ పెట్టారని అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ సాయంత్రం రానుంది. విజయ్ సేతుపతి చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa