రాంగోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సల్ సెలబ్రిటీ. ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎవర్ని తిడతాడో ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతాడో ఎవరికీ తెలియదు . అలాంటి వర్మ ఈ సంవత్సరం మొదలవుతూనే పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు . తనకు శ్రీదేవి కంటే పవన్ కల్యాణ్ అంటేనే ఇష్టమని పేర్కొన్న వర్మ.. తనను క్షమించాలని వేడుకున్నారు. వర్మ నిర్మాతగా రూపొందిన 'బ్యూటిఫుల్' సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రి న్యూ ఇయర్ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. గతంలో పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. తన మనసులోని మాటను ఈ రోజు తాను బయటకు చెప్పాలని అనుకుంటున్నానని పేర్కొన్న వర్మ, పవన్ గారికి ఓ తిక్కుందని, లెక్క కంటే తిక్కే అందరికీ ఎక్కువగా నచ్చుతుందని పేర్కొన్నారు. ఆయన అందుకే సూపర్ స్టార్ అయ్యాడన్నారు. 'పవన్ గారూ.. నన్ను క్షమించండి' అని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa