ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవాకు జోడీగా షాలినిపాండే

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 26, 2017, 11:28 AM

 ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో తెలుగు కుర్రకారు మదిలో తిష్ట వేశారు షాలినిపాండే. ఇప్పుడు తమిళంలో జీవా ప్రకాశ్‌కు జోడీగా ‘100% కాదల్‌’ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా మరో లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. వైవిధ్య నటుడు జీవాతో జోడీ కడుతోంది. ఆల్‌ఇన్‌ ఫిక్చర్స్‌ బ్యానరుపై విజయరాఘవేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా జీవాతో నిర్మిస్తున్న మూడో చిత్రం కావడం విశేషం. డాన్‌ చాండి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘హాస్యం, ప్రేమ కలగలసిన థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ‘విక్రం వేదా’ ఫేమ్‌ శ్యామ్‌ సీఎస్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇది జీవాకు 29వ సినిమా. సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయే ఓ ముఖ్యమైన అంశం దాగుంది. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తాం. జనవరి నుంచి చిత్రీకరణ ఆరంభంకానుంద’ని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa