తెలుగు అమ్మాయిగా అందరి అభిమానాన్ని చూరగొన్న నటి అంజలి. పుట్టింది తెలుగు గడ్డపైనే అయిన తమిళ జనాలకి చాలా దగ్గరైంది. ఈ రోజుల్లో ఐదారేళ్లు ఇండస్ట్రీలో నెట్టుకు రావడమే కష్టంగా ఉంటే, అంజలి ఏకంగా పదేళ్ళు పూర్తి చేసుకుంది. తాను నటించిన తాజా చిత్రం బెలూన్ ఈ నెల 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. జర్నీ ఫేం హీరో జై ఈ చిత్రంలో నటించాడు. హరర్ జోనర్‌లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుండగా, ఇందులో ఉన్న కొన్ని అంశాలు ఆడియన్స్‌ని ఎంతగానో అలరిస్తాయని చెప్పుకొచ్చింది. అయితే ఇండస్ట్రీలో దశాబ్ధం కాలం రాణించడం చాలా ఆనందంగా ఉందన్న అంజలి, మరో పదేళ్లు హీరోయిన్‌గా రాణిస్తానంటూ పేర్కొంది. మరి ఈ అమ్మడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే అంజలి మరో పదేళ్ల కెరియర్‌లో మరిన్ని మంచి సినిమాలతో మనముందుకు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa