భళ్ళాలదేవుడు రానా క్రిస్మస్ లంచ్ అల్లూ ఫ్యామిలితో కలిసి చేశాడు. ఈ సందర్భంగా బన్నీ తనయుడు, లిటిల్ అల్లూ అయాన్‌ని తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఓ ఫోటో దిగాడు. ఈ ఫోటోని ఫేస్ బుక్ పేజ్‌లో పోస్ట్ చేస్తూ తన స్నేహితులంతా కుర్రాళ్లుగా తయారవుతున్నారని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన విందులో నటుడు, జనసేన చీఫ్ పవన్‌తోపాటు రానా ఓ సెల్ఫీ దిగాడు . ఈ పిక్ కూడా నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలలో పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa