సోషల్ మీడియా వేదికగా కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌పై జరుగుతున్న ప్రచారంపై ఆయన కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. పెమ్మసానికి ఎలాంటి వ్యాపారాలు లేవని.. ఆయనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతోనే తాము క్లారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తరఫున.. ఆయన కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
'తప్పుడు ప్రచారంపై హెచ్చరిక.. డా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి భారత్‌లోని ఏ ట్రక్కింగ్ లేదా లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఏ కంపెనీని నడపడం, నియంత్రించడం, ప్రోత్సహించడం లేదా మద్దతు ఇవ్వడం చేయడం లేదు. అలాగే, రియల్ ఎస్టేట్, మైనింగ్, రవాణా లేదా అనుబంధ రంగాల్లో ఆయనకు ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవు. ఎక్కడైనా ప్రచారం అవుతున్న ఏ ప్రకటనలు, చిత్రాలు, ప్రచార సమాచారం లేదా ఆరోపణలు పూర్తిగా అబద్ధమైనవి, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. ఇవి ఆయన గౌరవం, ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతో చేసిన చర్యలుగా పరిగణించబడతాయి' అని క్లారిటీ ఇచ్చారు.
'డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏ అక్రమ లేదా అనైతిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరు, సహించరు కూడా. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని మనవి చేస్తున్నాం. ఆయన పేరు లేదా ప్రతిష్ఠను అనధికారికంగా వినియోగించిన వారిపై, ముందస్తు సమాచారం లేకుండానే, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇలాంటి తప్పుడు లేదా మోసపూరిత సమాచారాన్ని ఎవరైనా గమనిస్తే, తక్షణమే మా కార్యాలయానికి తెలియజేయగలరు' అంటూ ట్వీట్ చేశారు.
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా BSNL ముందుకు సాగుతోందన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నెలవారీ సమీక్షలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, హర్యానా BSNL సర్కిళ్ల పనితీరును పరిశీలించామన్నారు. ఈ సమీక్షలో ఆంధ్రప్రదేశ్, యూపీ ఈస్ట్ సర్కిళ్లు మంచి ఫలితాలు కనిపించాయని.. ఈ ఫలితాలు సాధించిన అన్ని BSNL బృందాలకు అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa