నాగశౌర్య, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'ఛలో'. వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతమందించారు. భాస్కర భట్ల సాహిత్యంతో ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాట 'చూసీ చూడంగానే'కి మంచి స్పందన వచ్చింది. కాగా, తాజాగా ఈ పాట తాలుకూ 1.51 నిమిషాల వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలోని విజువల్స్ కుర్రకారుని అలరించేలా ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న ఈ సినిమా తెరపైకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa