అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి- కేతిక శర్మలు జంటగా నటిస్తున్న చిత్రం 'రొమాంటిక్'. ఇంతకుముందే 'నువ్వూ నేనూ ఈ క్షణం..' అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. దానికి మంచి స్పందన దక్కింది. రొమాంటిక్ నుంచి మరో సాంగ్ రాబోతుంది. 'నా వల్ల కధే.. ' అనే సాంగ్ ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ ని వదిలింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్-ఛార్మిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే ఘాడమైన ప్రేమతో కూడుకున్న సీరియస్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనిల్ పాడూరి. ఈ సినిమా ఫస్ట్ లుక్, కొన్ని పోస్టర్స్ విడుదల చేయడంతో సినిమాపై పూరి అభిమానులు అమాంతం అంచనాలను పెంచేసుకున్నారు. ఆకాష్ పూరి కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa