సునీల్ టాలీవుడ్‌లో కమెడియన్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సునీల్‌కు హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్లీ సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తున్నాడు . అయితే సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయన్ని కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. సునీల్ హాస్పటల్‌లో ఏ విషయమై జాయిన్ అయింది కుటుంబ సభ్యులు కానీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు. సాధారణ చెకప్‌ల కోసమే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడా ? లేకపోతే ఏమైనా సీరియస్ కండిషనా అనే విషయం తెలియడం లేదు. మొత్తంగా సునీల్ అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa