స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే తాజాగా వైజాగ్ లో ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది, అయితే అభిమానుల కోసం రేపు తిరుపతిలో ఈ సినిమా స్పెషల్ సక్సెస్ ఈవెంట్ కి సంబంధించి మరో ప్రత్యేక కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుతో మరణించడంతో తిరుపతిలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని చిత్రబృందం రద్దు చేసింది. ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవికీ స్వయానా అన్నయ్య అవుతారు. చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ రాజేంద్ర ప్రసాద్ తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం బన్నీకి తీరని లోటు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa