ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానా 'హిరణ్య కశ్యప’ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2020, 01:02 PM

దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ‘రానా’ ప్రధాన పాత్రగా ‘హిరణ్య కశ్యప’ అనే భారీ పౌరాణికం మూవీ రాబోతుంది.  ఈ సినిమా సమ్మర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. రానా ప్రస్తుతం చేస్తోన్న విరాట పర్వం మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఆ తరువాత నుండి ‘హిరణ్య కశ్యప’ చిత్రం పైనే రానా తన దృష్టిని పెట్టనున్నాడు. ఇక ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉండటం కారణంగా ఈ సినిమాను 150 కోట్లకు పైగా బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ప్రసుతం పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు షాట్ డివిజన్, ఫొటోగ్రఫీ బ్లాక్స్ తో సహా బౌండ్ స్క్రిప్ట్ ను పూర్తిగా రెడీ చేసుకుంటుంది చిత్రబృందం. దగ్గుబాటి రానా చేయనున్న ఈ క్రేజీ సినిమా పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా రూపొందనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa