ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానా మూవీకి ఈ ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టబోతున్నారంట!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2020, 01:56 PM

దర్శకుడు తేజ చాల సంవత్సరాల తరువాత రానాతో తీసిన ‘నేనేరాజు నేనేమంత్రి’తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ లకి వచ్చాడు. అయితే  తేజ ఆ తరువాత తీసిన ‘సీత’ సినిమాతో మళ్లీ ప్లాప్ ను ఎదురుకున్నాడు. అందుకే ఈ సారి తనకు కలిసొచ్చిన కాంబినేషన్ తోనే మళ్ళీ మరో సినిమాతో రాబోతున్నాడు. హార్డ్ హిట్టింగ్ డ్రామాతో ‘రానా’ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకి ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అనే టైటిల్ ను పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. ప్రస్తుతం రానా ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో తానూ హీరోగా సాయిప‌ల్ల‌వి హరోయిన్ గా రాబోతున్న ‘విరాట పర్వం` షూటింగ్ లో బిజీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa