‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది అనన్య పాండే. తొలి చిత్రంతోనే యువతరం హృదయాల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం హిందీ పరిశ్రమలో ఈ సొగసరికి మంచి ఆఫర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం నటుడు విజయ్ దేవరకొండతో ఈ భామ జోడీ కట్టబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండతో దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఫైటర్. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ బాలీవుడ్ దర్శక..నిర్మాత కరణ్‌జోహార్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇందులో నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. తొలుత జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా ఆమె ఈ సినిమాని అంగీకరించలేకపోయింది. తాజాగా ఈ చిత్రంలో అనన్యపాండేను నాయికగా ఖరారు చేయబోతున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa