హేమంత్ మధుకర్ దర్శకత్వంలో హీరోయిన్ అనుష్క చేస్తున్న కొత్త చిత్రం ‘నిశ్శబ్దం’ రూపొందుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి జనవరి 31న విడుదల చేయాలని అనుకున్నారు. ఈ తేదీని చాలారోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. కానీ ఎలాంటి విడుదల సన్నాహాలు కనిపించడంలేదు. ఎక్కడా రిలీజ్ హడావుడి లేదు. చిత్ర బృందం నుండి ప్రమోషన్స్, అప్డెట్స్ లాంటివి ఏవీ రావట్లేదు. దీంతో విడుదల వాయిదా కన్ఫర్మ్ అని తేలిపోయింది. ఈ వాయిదాకు కారణం సాంకేతిక కారణాలే అని తెలుస్తోంది. దీంతో కొంత నిరుత్సాహానికి గురైన స్వీటీ ఫ్యాన్స్ కొత్త డేట్ ఎప్పుడో చెప్పాలని కోరుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో మాధవన్, అంజలి, షాలిని పాండేలతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసెన్ కూడా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa