ఉరికంబం ఎక్కబోతున్న ‘నిర్భయ’ దోషులను క్షమించాలని సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ నిర్భయ తల్లిదండ్రులకు సూచించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఇందిరా జైసింగ్ లాంటి మహిళలను నిర్భయ దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచాలని మండిపడింది. కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేస్తేనే అప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దారుణాలకు పాల్పడిన దోషులు, హంతకులపైన ప్రేమ, జాలి ఎలా పుట్టుకువస్తాయని నిలదీసింది. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు, హంతకులకు జన్మనిస్తారని మండిపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa