ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహజీవనం మంచిదే : కేథరీన్‌ ట్రెసా

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2020, 01:43 PM

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌తో   కలిసి తెరపైకి రాబోతోంది అందాల తార కేథరీన్‌ ట్రెసా. నలుగురు నాయికల్లో ఒకరిగా నటించినా, తన పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుందని చెబుతోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్‌ రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ గురించి కేథరీన్‌ మాట్లాడుతూ… దాదాపు ఎనిమిది నెలల కిందట దర్శకుడు క్రాంతి మాధవ్‌ ఈ సినిమా గురించి చెప్పారు. నేను చేయబోయే స్మిత పాత్ర గురించి వివరించారు. నేను కొంచెం ఆలోచించి నిర్ణయం చెప్తా అన్నాను. ఆ తర్వాత స్మిత పాత్ర ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది, నేనేమైనా పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవ్వాలా లాంటి ప్రశ్నలు అడిగాను.


ఆయన మీరు ఎలా ఉన్నారో అలా సెట్స్‌ దగ్గరకు వస్తే చాలా, ఏవైనా కావాల్సి ఉంటే అక్కడే మార్పులు చేద్దాం అన్నారు. మంచి రచయిత తనలో ఉండటం దర్శకుడిగా క్రాంతికి కలిసొచ్చే అంశం. చాలా వివరంగా కథను, పాత్రను రాసుకున్నారు. స్మిత ఒక ఉన్నతోద్యోగి, పట్టణంలో ఉండే అమ్మాయి. ఆధునికంగా కనిపిస్తుంది. విజయ్‌ దేవరకొండతో నేను కలిసి ఉండే సన్నివేశాలన్నీ చాలా సరదాగా సాగుతుంటాయి. నటుడిగా విజయ్‌ తను చేసే పాత్ర కోసం బాగా సిద్ధమవుతాడు. కథలో లీనమై నటిస్తాడు, సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. తనలో ఆ లక్షణాన్ని గమనించాను. పాత్రలకు నా నటన బలం కావాలని ఆలోచిస్తుంటాను. సహ జీవనం, పెళ్లి అనే వాటిపై నాకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. సహ జీవనం మంచిదే, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవచ్చు. పెళ్లంటే ఒకరి కోసం మరొకరు చేసేకునే జీవితకాల ఒప్పందం. సహజీవనం చేస్తున్నవాళ్లు, పెళ్లి చేసుకున్న స్నేహితులు నాకున్నారు. ప్రేమ లేకుండా ఎవరైనా ఉండగలమా. ప్రేమ అందరికీ కావాలి. ప్రేయసినే ప్రేమించాలని లేదు. కుటుంబ సభ్యులపై మనకు ఉండేది కూడా ప్రేమే.అలాగే నటిస్తుం టా. తెలుగులో నాకు నచ్చిన సినిమాలు రాలేదు అందుకే కొంత విరామం వచ్చింది. బాలకృష్ణతో నేను సినిమా చేస్తున్నానా? లేదా అనేది ఆ సినిమా నిర్మాతలను అడగాలి  అని చెప్పింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa