ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిల్ రాజు సోలో నిర్మాతగా మారుతున్నాడట!

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2020, 02:19 PM

మహేష్ తో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత సోలో నిర్మాతగా సినిమా చేద్దామంటే... 'మహర్షి' అప్పుడు పివిపి, అశ్వినిదత్తులు అడ్డుపడితే... 'సరిలేలు నీకెవ్వరూ' సినిమా టైం కి అనిల్ సుంకర అడ్డొచ్చాడు. మహేష్ తో సోలో సినిమా చెయ్యాలని కలలు కన్న దిల్ రాజుకి రెండు సినిమాలు అలా అయ్యాయి. తాజాగా వంశి పైడిపల్లి తో మహేష్ చెయ్యబోయే సినిమాకి దిల్ రాజు సోలో నిర్మాతగా మారుతున్నాడట. ఈసారి ఎవరితోనూ మహేష్ సినిమాని షేర్ చేసుకోవడం లేదని తెలుస్తుంది. వేరే నిర్మాతలతో డబ్బు పెట్టి.. లాభాలను షేర్ చేసుకోలేనని.. ఈసారి సింగిల్ గానే మహేష్ సినిమాని నిర్మించాలని డిసైడ్ అయ్యాడట. ఇక మహేష్ కూడా దిల్ రాజు బడ్జెట్ స్ట్రేటజీ, అతని ప్రమోషన్స్ చేసే వైనం, అలాగే ప్లానింగ్ అన్ని నచ్చి మరో సినిమాకి అవకాశం ఇచ్చాడనే టాక్ వినబడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa