ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఓ డియర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అలాగే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని టాక్. అయితే ఈ సినిమా అనంతరం ప్రభాస్ తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పాడు. తనకు మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి జరుగుతుందని సమాచారం. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa