ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మిర్చి' కి ఏడేళ్లు!

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2020, 04:29 PM

తెలుగు సినిమాకు ఘాటును పరిచయం చేసిన 'మిర్చి' కి అప్పుడే ఏడేళ్లు వచ్చేసాయి. అప్పటి వరకు వున్న ప్రభాస్ ఇమేజ్ కి మించి కొరటాల శివ సరికొత్తగా ప్రభాస్ ను ఈ సినిమాలో చూపించారు. మిర్చిలో ప్రభాస్ స్టైల్, డ్రెస్సింగ్ ను ఏడేళ్లు అయినా అభిమానులు ఇంకా ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రేమతో పగను కూడా జయించవచ్చు అనే కథతో కొరటాల తీరికెక్కిన ఈ సినిమా ఎందరో అభిమానుల ప్రేమను సొంతం చేసుకుంది. ప్రభాస్ తన సినీ కెరీర్ లో మరో మెట్టు ఎక్కడానికి 'మిర్చి' ఎంతో దోహదపడింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం ప్రభాస్, కొరటాలతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa