ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వరల్డ్ ఫేమస్ లవర్' కి యూ/ఏ సర్టిఫికెట్ !

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2020, 03:56 PM

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ వరల్డ్ ఫేమస్ లవర్. ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ తో వి ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. దీనితో చిత్రంపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగుతో పాటు తమిళంతో కూడా విడుదల అవుతుంది. నేడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ నిడివి 155 నిమిషాలుగా నిర్ణయించారు. అనగా దాదాపు 2.35 నిముషాలు అన్న మాట. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్స్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa