ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ మూవీ షూటింగ్ కి బ్రేక్..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 01:34 PM

ఎన్నడూ లేని విధముగా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ తో పాటుగా... పొలిటికల్ మీటింగ్స్ కి హాజరవుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా నెల అవ్వకముందే... అపుడే సినిమా షూటింగ్స్ కి బ్రేకిచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఈనెల 12, 13 తేదీల్లో కర్నూలులో పర్యటించడానికి పవన్ ప్రణాళిక సిద్ధం కావడంతో.. కొన్ని రోజులు తాత్కాలికంగా పవన్ పింక్ రీమేక్ షూటింగ్ కి బ్రేక్ వేసారట. కర్నూలు పర్యటన రెండు రోజుల్లో ముగించుకుని అటునుండి ఆటే పవన్ కళ్యాణ్ అమరావతి రైతులతో భేటీ అవుతాడని.. ఈలోపు పింక్ రీమేక్ షూటింగ్ కి బ్రేక్ పడినా.. క్రిష్ మాత్రం పవన్ కి సంబంధం లేని సీన్స్ ని షూట్ చేస్తాడని తెలుస్తుంది. 15 న అమరావతిలో రైతుల తో ముఖాముఖీ తర్వాత పవన్ నేరుగా హైదరాబాద్ చేరుకొని షూటింగ్ కి డైరెక్ట్ గా హాజరవుతాడని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa