ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా సినిమాల్లోకి వస్తున్నాడా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 05:37 PM

కొంతకాలంగా పవన్ వారసుడు అకిరా సినిమాల్లోకి వస్తున్నాడనే పలు ఊహగానాలు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చాయి. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అకిరాను పరిచయం చేయాలని యోచిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అకిరా హీరోగా అందంగా ఉంటాడని... మెగా అభిమానులు అకీరా సినిమాల్లోకి ప్రవేశించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. కాకపోతే, అకిరా జూనియర్ పవన్ కళ్యాణ్ కావాలని రేణు దేశాయ్ కోరుకోవడం లేదని మెగా ఫాన్స్ ఫీలయ్యారు. అయితే పవన్ అకిరా కోసం పెద్ద కలలు కంటున్నాడని...అలాగే అకీరాని తెరపై అద్భుతమైన పద్ధతిలో ఆవిష్కరించేందుకు ప్లాన్ చెయ్యడమే కాకుండా... ప్రఖ్యాత సంస్థలో నటనలో శిక్షణ ఇప్పించాలని యోచిస్తున్నాడట. ఇక రేణు దేశాయ్ కూడా అకీరాకు నటనపై ఆసక్తి కలిగి ఉంటే.. అకీరాని ఆపనని చెబుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa