ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లరి నరేష్ 'నాంది' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి !

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2020, 01:35 PM

అల్లరి నరేష్ గత కొంతకాలంగా హీరోగా వరుస ప్లాప్స్ ఎదురుకుంతున్నాడు. ప్రస్తుతం విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌.వి. 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న నిర్మాణంలో 'నాంది' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయినట్లు సమాచారం. అల్లరి నరేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా కోసం బ్రహ్మకడలి, ఛోటా.కె.ప్రసాద్‌, శ్రీచరణ్‌ పాకాల, అబ్బూరి రవి వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్‌ పాకాల అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa