ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ – క్రిష్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి డేట్ ఫిక్స్ !

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2020, 04:04 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ తో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే కీలక సిన్నవేశాలను షూట్ చేసిన పవన్ కళ్యాణ్ పై ఒక పవర్ ఫుల్ ఫైట్‌ను చిత్రీకరించారట. సినిమా కూడా ఈ ఫైట్ మీదే ఓపెన్ అవుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. పవన్ మరో సినిమా క్రిష్ తో తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాలలోని కొన్ని ఎపిసోడ్స్ షూట్ లో కూడా పవన్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం క్రిష్ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం మంగళవారం నుండి ప్రారంభమవ్వనుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువ షూట్‌ చేయనున్నారు. కాగా ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా సినిమా టైటిల్ ఇదేనంటూ బజ్ వినబడుతోంది. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa