వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథా కథనాలతో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ `15-18-24లవ్ స్టోరీ`. మాజేటి మూవీ మేకర్స్ కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్ దేవాదుల(బాహుబలి ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా విడుదల చేసి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. అలాగే టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa