అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ వంటి షో తో బుల్లి తెర మీద ఒక వెలుగు వెలుగుతుంది. ప్రస్తుతం సినిమాల మీద కూడా దృష్టి పెట్టింది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ పాత్ర కోసం అనసూయని చిత్ర యూనిట్ సంప్రదించింది. సుకుమార్ ఆమె పై ఆసక్తి చూపించడంతో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనసూయ. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది అని నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని, అందుకే అనసూయ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇది నిజమే అంటుంది టాలీవుడ్ కూడా. మరి ఎంత వరకు నిజమో చూడాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa