విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో బామ్మగా నటించిన కిషోరి బల్లాళ్ కన్నుమూసారు. దాదాపు 70 సినిమాల్లో నటించిన కిషోరి బల్లాళ్ కన్నడతో పాటు హిందీలో కూడా నటించింది . బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన 'స్వదేశ్' చిత్రంలో ఆయనకు అమ్మగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు కిషోరి. ఆ సినిమాలో కావేరీ అమ్మగా ఆమె నటనకు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమె.. ఫిబ్రవరి 18న కన్నుమూసారు. ఈమె మరణంతో కన్నడ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1960లో 'ఇవలెంత హెందాతీ' చిత్రంతో వెండతెర తెరంగ్రేటం చేశారు కిషోరి.
ఆ తర్వాత కూడా ‘అయ్య', 'కెంపేగౌడ', 'నమ్మణ్ణ', 'గేర్ కానూని' లాంటి చాలా కన్నడ సినిమాుల చేసారు ఈమె.. కన్నడ మెగా సీరియల్ 'వర్షిణి'లోనూ వందల ఎపిసోడ్స్ కనిపించారు ఈమె. కన్నడ సూపర్ స్టార్స్ విష్ణువర్ధన్, అంబరీష్, ప్రభాకర్, దర్శన్, సుదీప్‌లతో కలిసి నటించారు ఈమె. కెంపేగౌడ ప్రశస్తి, కన్నడ అకాడమీ ప్రశస్తి, ఐఫా ప్రశస్తి లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు కూడా కిషోరి దక్కించుకున్నారు. కిశోరి బల్లాళ్ మృతికి కర్ణాటక చలనచిత్ర మండలి అధ్యక్షుడు జయరాజ్‌తో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈమె మృతికి సంతాపం తెలియచేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa