‘మహానటి’ పేరు చెప్పగానే ఒకప్పుడు సావిత్రి గుర్తుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆమె పాత్రను పోషించిన కీర్తి సురేష్ గుర్తుకొస్తున్నారు. అంతలా ఆ పాత్రలో జీవించేశారు కీర్తి సురేష్. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన "మిస్ ఇండియా" సినిమా తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో జగపతిబాబు .. రాజేంద్ర ప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. నవీన్ చంద్ర తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంత గ్యాప్ తరువాత కీర్తి సురేశ్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో కీర్తి సురేశ్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa