తెలుగులో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో నటించిన ముద్దుగుమ్మ శ్రియ . ఇప్పుడు మరో సీనియర్ హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. హీరో రాజశేఖర్ తాజాగా ‘అహ నా పెళ్ళంట’ ‘పూలరంగడు’ దర్శకుడు వీరభద్రంతో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రియ నటించనుంది. ఈ సినిమా కోసం వీరభద్రం చౌదరి శ్రియని ఏరికోరి తీసుకోవడానికి కారణం లేకపోలేదు. రాజశేఖర్ వయసుకి తగిన కథానాయిక కావాలన్నది వీరభద్రం ఆలోచన అని టాక్. పైగా ఆ పాత్ర హుందాగా, గ్లామరస్ గా ఉంటుందట. అందుకే శ్రియ పేరు ఎంపిక చేసినట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa