కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రస్తుతం ఈ అమ్మడు భారతీయుడు 2 చిత్రంలో కమల్ సరసన కథానాయికగా నటిస్తుంది. చెన్నైలో జరుపుకుంటున్న షూటింగ్‌లో కాజల్ పాల్గొనగా, నిన్న జరిగిన ప్రమాదం సమయంలో కాజల్ అక్కడే ఉందట. తన ఎక్స్‌పీరియన్స్‌ని ట్విట్టర్‌లో వివరించింది కాజల్. ఈ ఘటనపై నేను ఎంత బాధపడుతున్నానో చెప్పడానికి మాటలు రావడంలేదు. గత రాత్రి జరిగిన ప్రమాదంలో నా ముగ్గురు కొలీగ్స్‌ను కోల్పోయాను. కృష్ణ, చంద్రన్, మధు కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
నా ముగ్గురు స్నేహితుల ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో వెంట్రుక వాసిలో నేను తప్పించుకున్నాను కాబట్టి ఇప్పుడు ట్వీట్స్ చేయగలుగుతున్నాను. ఈ ప్రమాదంతో సమయం, జీవితం గురించి పెద్ద గుణపాఠాలే నేర్చుకున్నాను’ అని కాజల్ తన ట్వీట్‌లో తెలిపారు. ఈవీపీ స్టూడియోలో సెట్స్ వేస్తుండగా.. 150 అడుగుల ఎత్తునున్న క్రేన్ ఒక్కసారిగా తెగిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సహాయకులు మృతి చెందగా, మరో పది మందికి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే.
Words cannot describe the heartache I feel at the unexpected,untimely loss of my colleagues from lastnight.Krishna,Chandran and Madhu.Sending love,strength and my deepest condolences to your families.May god give strength in this moment of desolation. #Indian2 @LycaProductions
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 20, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa