కండలు తిరిగిన దృఢకాయంతో మతి పోగొడుతున్న ఈ హీరో ఎవరో చెప్పగలరా? అటు తిరిగి నిలుచోవడంతో గుర్తు పట్టలేకపోతున్నారా? దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితమైన విలక్షణ నటుడు ఇతడు. తమిళ సినిమాల్లో హీరోగా సత్తా చాటిన ఈ నటుడు విలన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అతనెవరో కాదు తమిళ హీరో ఆర్య. తన 30వ సినిమా కోసం తీవ్రంగా శ్రమించి కండలు పెంచి కొత్త అవతారంలోకి మారిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడిస్తానని చెబుతూ ఈ ఫొటోను ఆర్య ట్వీట్ చేశాడు. ‘మీరంతట మీరు బలవంతులుగా మారేంత వరకు తెలియదు మీరెంత బలవంతులో’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa