ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇండియన్ 2' సెట్స్ లో జరిగిన ప్రమాదంపై స్పందించిన బన్నీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 02:39 PM

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'ఇండియన్ 2' సినిమా సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వార్తా విని షాక్ కి గురయ్యానని.. జరిగిన సంఘటన నిజంగా బాధాకారం అన్నారు. అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో హార్డ్ వర్క్ చేసే ముగ్గురు టెక్నీషియన్స్ ని కోల్పోవడం జరిగింది. వారి ఆత్మలు శాతించాలని కోరుకుంటున్నా అని అల్లు అర్జున్ తెలిపారు. కాగా పలువురు హీరోలు సైతం ఈ ఘటనపై స్పందిస్తున్నారు. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa