రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 8న విడుదల కానుంది. అయితే ఈ సారి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ను కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ప్రత్యేకంగా ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ తో పాటు ఒక గేమ్ ను డిజైన్ ను చేయించే ఆలోచనలో ఉన్నాడట. ప్రమోషనల్ సాంగ్ తెలుగులో కొత్త గాని, బాలీవుడ్ లో చాలానే వస్తుంటాయి. మరి ఆ ప్రమోషనల్ సాంగ్ ఎలా ఉండబోతుందో. ఎలాగూ మ్యూజిక్ కీరవాణి కాబట్టి సాంగ్ పై భారీ అంచనాలే పెట్టుకోవచ్చు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటిస్తోంది. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa