డైరెక్టర్ బోయపాటి శ్రీను నటుడు బాలకృష్ణ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారు, కథేంటి, టైటిల్ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేయడానికి బోయపాటి బృందం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఆవకాశం ఉండగా.. ఒక హీరోయిన్ గా తెలుగమ్మాయి అంజలిని ఎంపిక చేసినట్టు చిత్రబృందం తెలిపింది. దాంతో బాలయ్య సరసన అంజలి నటించే రెండో చిత్రం ఇది కానుంది. గతంలో డిక్టేటర్ అనే చిత్రంలో ఈ తెలుగమ్మాయి నటించింది. కాగా మరో హీరోయిన్ ఎవరనేదానిపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే శ్రియనే ఫిక్స్ చేసినట్టు సమాచారం. కానీ చిత్ర వర్గాల నుంచి ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa