కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘చిరు 152వ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో అతిధి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారని.. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి కొరటాల శివ మహేష్ కి చెప్పారని.. మహేష్ కూడా అతిధి పాత్రలో నటించడానికి అంగీకరించారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో కొరటాల కొన్ని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయట. ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa