మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాపై మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబడుతుంది. అయితే ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్న వారికి ఎట్టకేలకు తీపికబురు అందింది. అలవైకుంఠపురంలో సినిమాకి సన్ నెక్ట్స్ భారీ రేట్ ఇచ్చి మరీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు కూడా ఈ సినిమాని దక్కించుకోవాలని ప్రయత్నించినా నిర్మాతలు మాత్రం సన్ నెక్ట్స్ కి అమ్మేశారు. అయితే సినిమాను 50 రోజులకు రిలీజ్ చేయాలని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే జనవరి 12న ఈ సినిమా విడుదలవ్వడంతో 50 రోజులు అంటే సన్ నెక్ట్స్ లో ఫిబ్రవరి 26న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa